సంసారంలో ఆస్తి చిచ్చు... నిద్రపోతున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య
ఆస్తి వివాదం పచ్చటి సంసారంలో చిచ్చు రేపింది. కట్టుకున్న భర్తనే ఓ మహిళ అత్యంత కిరాకతంగా చంపేసిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో వెలుగుచూసింది. పొదిలిలోని పడమటిపాలెంకు చెందిన ముల్లా మహబూబ్(59), షకీలా దంపతులు. మహబూబ్ కర్రల వ్యాపారం చేస్తూ బాగానే కూడబెట్టాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో 20 సంవత్సరాల క్రితం రియాజ్ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. వ్యసనాలకు బానిసైన రియాజ్‌పై తండ్రి మహబూబ్ తరచూ కోప్పడేవాడు. బాగుపడతాడని గతంలో రియాజ్‌తో కిరాణా దుకాణం పెట్టించగా నష్టాలు వచ్చాయి. Also Read: కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని దత్త పుత్రుడు నాశనం చేస్తుండటంతో మహబూబ్ తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తన ఆస్తిని సోదరుడి కుమారులకు రాసిచ్చేస్తానంటూ అతడు భార్య షకీలాతో తరచూ చెబుతుండేవాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం పెద్దమనుషుల సమక్షంలో భార్యాభర్తలు, కుమారుడిని కూర్చోబెట్టి పంచాయితీ పెట్టారు. తన దత్తకొడుకు జులాయిగా మారడంతో తన ఇంటికి సోదరుడి కొడుకులకు ఇచ్చేస్తానని మహబూబ్ పెద్ద మనుషులకు చెప్పాడు. ఈ క్రమంలోనే అధికారులను పిలిచి ఇంటిని కొలతలు కూడా వేయించాడు. Also Read: భర్త తీరుతో అతడిపై కక్ష పెంచుకున్న భార్య షకీలో గురువారం తెల్లవారుజామున గదిలో నిద్రపోతున్న భర్త తలపై రోకలిబండతో కొట్టి చంపేసింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ వి. శ్రీరాం, ఎస్సై కె.సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షకీలో ఒక్కతే భర్తను చంపిందా? వేరెవరైనా సాయం చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By February 21, 2020 at 09:49AM
No comments