Breaking News

ఉదయగిరిలో కీచక డాక్టర్... నైట్‌ డ్యూటీలో ఉన్న నర్సును కోరిక తీర్చాలంటూ


ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన ప్రవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్ కీచకుడి అవతారమెత్తాడు. తన వద్ద పనిచేసే నర్సులను కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన కలకలం రేపింది. భాధితురాలి బంధువులు ఆ కీచక వైద్యుడికి ఆస్పత్రిలోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Also Read: ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ పనిచేస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్‌పై గతంలోనే నర్సులను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంగళవారం ఓ స్టాప్‌ నర్సును కోరిక తీర్చాలంటూ వేధించాడు. నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సును ఆమ్లెట్ వేసి తీసుకురావాలని ఆదేశించిన డాక్టర్.. ఆమె రూమ్‌లోకి వెళ్లిన తర్వాత 10 నిమిషాలు తనతో గడపాలంటూ వేధించాడు. తాను అలాంటి దానిని కాదని మొత్తుకున్నా వినకుండా కోరిక తీర్చకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. Also Read: బుధవారం బంధువులను వెంటబెట్టుకుని ఆస్పత్రికి వచ్చి డాక్టర్‌ను నిలదీసింది. ఆమె బంధువులు ఆ కీచకుడికి ఆస్పత్రిలోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. విషయం జిల్లా కలెక్టర్‌ వద్దకు చేరడంతో దీనిపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఠాగూర్ గతంలో పనిచేసిన ఆస్పత్రుల్లోనూ నర్సులను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఎక్కడికి వెళ్లినా అతడి బుద్ధి మారడం లేదని కొందరు చెబుతున్నారు. కొందరు ఉన్నతాధికారుల అండతో అతడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. Also Read:


By February 12, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/doctor-arrested-in-nellore-district-over-sexual-harassment-on-staff-nurse/articleshow/74093464.cms

No comments