ఒంటరిగా ఉన్న మరదలిపై బావ అఘాయిత్యం.. తలుపులు మూసేసి
భార్య చెల్లెలిపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించిన ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. ఓల్డ్ మీర్జాలగూడకు చెందిన చింక లక్ష్మీనారాయణ అలియాస్ సతీష్ వంటపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య చెల్లెలిపై ఎప్పటి నుంచో కన్నేశాడు. ఈ నెల పదో తేదీ రాత్రి ఏదో పని నిమిత్తం లక్ష్మీనారాయణ మరదలి ఇంటికి వెళ్లాడు. Also Read: ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఆమెను కోరిక తీర్చాలని వేధించాడు. ఇలాంటి పనులు చేయొద్దని ఆమె హెచ్చరించడంతో తలుపులు మూసి అత్యాచారం చేయబోయాడు. దీంతో బెదిరిపోయిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలు కుటుంబసభ్యులకు ఈ విషయం చెప్పి వారి సలహాతో మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
By February 12, 2020 at 08:57AM
No comments