50-70 లక్షల మంది స్వాగతం పలుకుతారు.. నా ఫ్రెండ్ మోదీ చెప్పారు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్ వస్తున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ట్రంప్ పర్యటించనున్నారు. సతీసమేతంగా వస్తోన్న అమెరికా అధ్యక్షుడికి భారత్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పనుంది. మోదీ మంచి మిత్రుడని, భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్రంప్ తెలిపారు. మీకు స్వాగతం పలికేందుకు లక్షలాది మంది ప్రజలు వస్తారని మోదీ చెప్పారని ట్రంప్ తెలిపారు. భారత పర్యటన నేపథ్యంలో ఆయన ఇటీవలే ప్రధాని మోదీతో మాట్లాడారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌పోర్టు నుంచి మొతేరా స్టేడియం వరకు 5-7 మిలియన్ల మంది వస్తారని మోదీ చెప్పారన్నారు. 50 వేల మంది ప్రజలు వస్తే నాకు సంతృప్తి ఉండదని ట్రంప్ జోకేశారు. ‘‘ఎయిర్‌పోర్టు నుంచి స్టేడియం వరకు 50 లక్షల నుంచి 70 లక్షల మంది వరకు వస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. ఈ స్టేడియం దాదాపుగా పూర్తి కావొచ్చింది’’ అని ట్రంప్ తెలిపారు. మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు హూస్టన్ నగరంలో హౌడీ మోడీ నిర్వహించారు. ఇదే తరహాలో ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో ‘‘కెమ్ చో ట్రంప్’’ను నిర్వహిస్తున్నారు. న్యూ సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి 1.25 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది.
By February 12, 2020 at 09:19AM
No comments