Breaking News

మహిళను నమ్మించి మద్యం తాగించి.. వికారాబాద్ జిల్లాలో దారుణం


జిల్లా బంట్వారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారం కోసం దుండగులు ఓ మహిళను అత్యంత దారుణంగా హత్యచేసి దహనం చేశారు. బంట్వారం మండలం బొపునాపురం గ్రామానికి చెందిన రాజు, భార్య అనిలాతో కలిసి కొన్నాళ్ల క్రితం ఉపాధి కోసం చేవెళ్ల వలస వచ్చాడు. వీరికి ఆరు నెలల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం దేవుని తిరుపమాపూర్ గ్రామానికి చెందిన చెన్నమ్మ(28) అనే మహిళ పరిచయమైంది. రాజు దంపతులు ఇటీవల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు Also read: ఈ క్రమంలోనే వారి కన్ను చెన్నమ్మపై పడింది. చెన్నమ్మ దగ్గర భారీగా ఆభరణాలు ఉన్నాయని తెలుసుకున్న రాజు, అనిలా వాటిని దోచుకోవాలనుకున్నారు. 20 రోజుల క్రితం చెన్నమ్మకు మాయమాటలు చెప్పిన రాజు ఆమెను బొపునారం గ్రామ శివారుకి బైక్‌పై తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి మద్యం తాగారు. పథకం ప్రకారం భార్యభర్తలకు చెన్నమ్మకు మద్యం ఎక్కువగా తాగించారు. ఆమె మత్తులోకి జారుకోగానే గొంతు నులిమి చంపేసి పొదల్లో శవాన్ని పడేసి వెళ్లిపోయారు. Also read: చెన్నమ్మ కనిపించకపోవడంతో ఆమె తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజు, అనిలాపై అనుమానం ఉందని అతడు ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా బంగారం కోసం చెన్నమ్మను తామే చంపేశామని నేరం అంగీకరించారు. దీంతో పోలీసులు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. భార్యభర్తలపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read:


By February 02, 2020 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-brutally-killed-in-vikarabad-district-couple-arrested/articleshow/73863731.cms

No comments