Breaking News

ప్రేమపెళ్లికి నో చెప్పిన పెద్దలు.. హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య


ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు పెద్దలు అప్పుకోకపోవడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మల్లిరెడ్డి నాగ సుబ్రహ్మణ్యంరెడ్డి (24) బీటెక్ చదివాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ గచ్చిబౌలి ఏపీహెచ్‌బీ కాలనీలోని ప్లాట్‌ నంబర్‌ 161లో ఉంటున్నాడు. Also Read: కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్న సుబ్రహ్మణ్యం ఆమెనే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాడు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ససేమిరా అనడంతో ప్రేమికులిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి మనస్తాపంగానే ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం నుంచి గుడివాడలో ఉంటున్న కుటుంబసభ్యులు ఫోన్ చేయగా సుబ్రహ్మణ్యం ఎత్తలేదు. దీంతో సోమవారం హైదరాబాద్‌లోనే ఉండే అక్క, బావ, మామ కలిసి అతడి ఫ్లాట్‌కి వెళ్లారు. తలుపులు మూసి ఉండటంతో ఎంత పిలిచినా అతదు స్పందించలేదు. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా సుబ్రహ్మణ్యం ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. Also Read:


By February 12, 2020 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/software-engineer-cimmits-suicide-in-hyderabad-over-parents-refuses-his-love-marriage/articleshow/74093104.cms

No comments