శ్రీశైలంలో ముంబయి మహిళపై హత్యాచారం.. సాధువుగా నమ్మించి అడవిలోకి తీసుకెళ్లి
అతడు చూడటానికి కాషాయ దుస్తులు ధరించి సాధువులా కనిపిస్తాడు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ దైవారాధనలో మునిగి తేలుతుంటాడు. కానీ అప్పుడప్పుడు అతడిలోని కామాంధుడు బయటకు వస్తుంటాడు. ఒంటరి మహిళ కనిపిస్తే అత్యాచారం చేసి చంపేస్తాడు. నల్లమల అభయారణ్యంలో ఈ నెల 2వ తేదీన మహిళ హత్యకేసులో నిందితుడిని నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అచ్చంపేట డీఎస్పీ నర్సింహులు, సీఐ బీసన్న ఈ కేసు వివరాలు గురువారం మీడియాకు వివరించారు. Also Read: ముంబయికి చెందిన మహిళ(52)కు దైవచింతన ఎక్కువ. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకునేది. గతేడాది డిసెంబరులో తిరుపతి వెళ్తున్నానని కుటుంబసభ్యులకు చెప్పి బయలుదేరింది. జనవరి నెలాఖరులో మల్లన్న దర్శనానికి వచ్చింది. మరోవైపు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా సమంతమలైకి చెందిన సాధువు మట్కాస్వామి అలియాస్ పిలకస్వామి(62) కూడా పుణ్యక్షేత్రాలను తిరుగుతుంటాడు. కొంతకాలంగా శ్రీశైలంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీశైలం ముంబయి మహిళకు పిలకస్వామి పరిచయమయ్యాడు. Also Read: నల్లమల అడవుల్లో ఉండే అక్కమహాదేవి ఆలయం చాలా మహిళ గలదని చెప్పిన ఆమెను తీసుకెళ్లాడు. జనవరి 25న ఇద్దరూ కలిసి కొద్దిదూరం జీపులో, మరికొంత దూరం బస్సులో ప్రయాణించి నల్లమల అభయారణ్యంలోని అటవీశాఖ రేంజ్ గేటు-168 సమీపంలో దిగారు. అక్కడి నుంచి కాలినడకన అక్కమహాదేవి గుహల వైపు బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక పిలకస్వామి ఆ మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనకు ప్రమాదమని భావించి కత్తితో ఆమె గొంతుకోసి చంపేసి పారిపోయాడు. ఈనెల 2న గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని అటవీ సిబ్బంది గుర్తించి ఈగలపెంట పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో ఆ మహిళకు చెందిన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, శ్రీశైలంలో బసచేసిన గది రశీదులు దొరకడంతో ఆమె వివరాలు సులభంగా కనుగొన్నారు. శ్రీశైలంలో ఆమె బసచేసిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. Also Read:
By February 07, 2020 at 08:37AM
No comments