Breaking News

కరోనాపై ముందే హెచ్చరించి హీరోగా మారిన ఆ డాక్ట‌ర్‌ ఇకలేరు


జనవరి ప్రారంభంలో ప్రబలుతోందని తోటి వైద్యులను హెచ్చరించిన ఆ డాక్టర్ ఇకలేరు. హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఆ వైద్యుడు చేసిన పోస్ట్ ఆయనను ప్రపంచానికి హీరోగా చేసింది. ఆ వైద్యుడు సైతం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు. చైనాలో ఇప్పటి వరకూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 630కి చేరుకుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెంది ప్రాణాలను హరించడంతో చైనా ప్రజా యుద్ధంగా ప్రకటించింది. కరోనా వైరస్‌పై హెచ్చరికలు చేసిన లీ వెన్‌లియాంగ్ (34) హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. Read Also: ఆప్తల్మాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ లీ.. కరోనా వైరస్‌పై చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇది ఫ్లూ వ్యాధి లాంటి వైరస్ అని, దీనిపై ప్రపంచ ఆరోగ్య అత్యవరస పరిస్థితి తప్పదంటూ హెచ్చరించారు. దీనిపై స్పందించిన పోలీసులు డాక్టర్ లీ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత డాక్టర్ లీ హీరోగా మారిపోయాడు. హాస్పిటల్ బెడ్ నుంచి ఆయన చేసిన పోస్టు ఆయన్ను హీరోగా మార్చేసింది. ‘హల్లో ఎవ్రీవన్.. నేను లీ వెన్‌లియాంగ్, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్లో ఆప్తాల్మాజిస్ట్‌గా పని చేస్తున్నాను’ అంటూ ఆయన పోస్టును ప్రారంభించారు. డిసెంబరు నెలాఖరులో కరోనా వైరస్ కేసు బయటపడటంతో ఏడుగుర్ని పరిశీలించిన డాక్టర్ లీ అది 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వైరస్‌‌గా భావించారు. వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ నుంచి ఈ కేసులు వెలుగు చూశాయని భావిస్తుండగా... పేషెంట్లను తన హాస్పిటల్లోనే పరిశీలనలో ఉంచారు. Read Also: డిసెంబర్ 30న తన సహచర డాక్టర్లతో చాటింగ్ చేస్తూ వైరస్‌పై లీ హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తిచెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పుడు ఇది కరోనా వైరస్ అని ఆయనకు తెలియదు. నాలుగు రోజుల తర్వాత డాక్టర్ లీని కలిసిన పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది తీవ్ర ఇబ్బందికరం అంటూ ఆయనతో బలవంతంగా ఓ లెటర్ మీద సంతకం చేయించుకున్నారు. నువ్వు ఇలాగే చేస్తే అక్రమ చర్యగా భావించి, కోర్టుకు ఈడుస్తామని కూడా అధికారులు హెచ్చరించారు. వైరస్‌పై వదంతులు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో డాక్టర్ లీ ఒకరు. జనవరి చివర్లో లీ చైనా సోషల్ మీడియా విబో ద్వారా ఓ లెటర్ కాపీని ప్రచురించిన లీ.. ఏం జరిగిందో అందులో వివరించారు. కరోనా వైరస్ ప్రబలిందని తెలియగానే స్థానిక అధికారులు ఆయనకు క్షమాపణలు చెప్పారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. Read Also: డాక్టర్ లీ మరణించారని తెలియడంతో చైనీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు.‘వుహాన్ మరణానికి మేము తీవ్రంగా దుఃఖిస్తున్నాం ... ఆయనను కాపాడటానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఫిబ్రవరి 7 తెల్లవారుజామున 2.58 నిమిషాలకు కన్నుమూశారు’ కమ్యూనిస్ట్ పార్టీ పీపుల్స్ డెయిలీ ట్వీట్ చేసింది. ఆయన నిజాలను మాట్లాడిన హీరో అంటూ ఆయనకు శెల్యూట్ చేస్తున్నారు. కొవ్వొత్తి వెలిగించి మా హీరోకు నివాళులు అర్పిస్తున్నాం.. మీరు రాత్రివేళ వెలుగుతోన్న కాంతి కిరణం అంటూ ఆయనపై తమ గౌరవాన్ని చాటుకుంటున్నారు. Read Also: జనవరి ఆరంభంలో ఈ వైరస్ కేవలం ఇన్ఫెక్షన్ బారిన పడిన జంతువులను తాకడం ద్వారా వస్తుందని అధికారులు భావించారు. దీంతో వైద్యుల రక్షణ కోసం ఎలాంటి సూచనలు చేయలేదు. పోలీసులను కలిసిన తర్వాత డాక్టర్ లీ గ్లుకోమాతో బాధపడుతున్న ఓ మహిళకు చికిత్స అందజేశారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని ఆయనకు తెలీదు... తర్వాత ఆయనకు జలుబు, దగ్గు మొదలైంది. జనవరి 10న ఆయన జలుబుతో బాధపడగా, మరుసటి రోజే జ్వరం వచ్చింది. రెండ్రోజులపాటు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఆయన పేషెంట్లు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వీరిని హాస్పిటల్‌కు తరలించారు. Read Also: జనవరి 20న చైనా ప్రభుత్వం కరోనాను అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. డాక్టర్ లీకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. చాలాసార్లు నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. జనవరి 30న నిర్వహించిన న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలో కరోనా పాజిటివ్ అని వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు చికిత్స కొనసాగింది. చివరకు శుక్రవారం ఆయన కన్నుమూశారు.


By February 07, 2020 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-kills-hero-wuhan-doctor-li-wenliang-who-sounded-alarm-as-toll-passes-630/articleshow/73997788.cms

No comments