సందీప్ నన్ను మోసం చేశాడు.. పోలీసులకు యాంకర్ రవి ఫిర్యాదు
సందీప్ అనే సినిమా డిస్ట్రిబ్యూటర్‌పై ప్రముఖ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో సందీప్ తన దగ్గర రూ.45 లక్షలు అప్పు తీసుకుని మోసం చేశాడంటూ రవి శనివారం కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పు తీసుకున్న సందీప్ కొద్దిరోజుల్లోనే కొంత మొత్తాన్ని తిరిగిచ్చాడని, ఇంకా రూ.41లక్షలు ఇవ్వాల్సి ఉందని యాంకర్ రవి చెబుతున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. Also Read: తాను ఎక్కడికి వెళ్లినా తన మనుషులను పంపి నిఘా పెడుతున్నాడని, అతడి నుంచి తనకు రక్షణ కల్పించాలని రవి పోలీసులను కోరాడు. తనలాగే చాలా మంది దగ్గర సందీప్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. Also Read: ఇదీ వివాదం.. యాంకర్ రవి హీరోగా 2017లో 'ఇది మా ప్రేమ కథ' అనే సినిమా తెరకెక్కింది. దీనికి సందీప్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. సినిమా ప్లాప్ కావడంతో రవి, సందీప్ మధ్య వివాదం నెలకొంది. గుడ్‌విల్ కింద ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని రవి వేధిస్తున్నాడంటూ సందీప్ 2018లో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై సందీప్ తనపై చేసిన ఆరోపణలను రవి అప్పట్లోనే ఖండించాడు. తాజాగా సందీప్‌పై రవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మళ్లీ చెలరేగింది. Also Read:
By February 10, 2020 at 10:21AM
No comments