Breaking News

గర్భం దాల్చిన టెన్త్ బాలిక.. పెళ్లి చేసుకోనని మొహం చాటేసిన ప్రియుడు


పెళ్లి చేసుకుంటానంటూ మైనర్ బాలికను ప్రేమలోకి దించిన ఓ యువకుడు అవసరాలు తీర్చుకున్నాక మొహం చాటేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వలస వెళ్లడంతో తాతయ్య ఇంట్లో ఉంటోంది. Also Read: బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న అదే గ్రామానికి చెందిన వేమగిరి గణపతి(22) అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించ రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో ఇటీవల బాలిక తరుచూ అనారోగ్యానికి గురవుతోంది. ఆమె శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన పాఠశాల సిబ్బంది వైద్య పరీక్షలు చేయించగా ఐదో నెల గర్భిణి అని తేలింది. Also Read: దీంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు గణపతిని పిలిపించి బాలికను పెళ్లిచేసుకోవాలని కోరగా తిరస్కరించాడు. ఆమె కడుపుకి తనకి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు మంగళవారం రాత్రి పేలు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకుంది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కరప పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 13, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-10th-girl-gets-pregnancy-over-lover-cheating-in-east-godavari/articleshow/74111553.cms

No comments