Breaking News

చరిత్ర సృష్టించిన భారతీయుడు.. యూఎస్ పవర్‌ఫుల్ కోర్టుకు చీఫ్ జస్టిస్‌గా రెండోసారి!


అమెరికా ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి దక్షిణాసియా వాసిగా భారతీయ జడ్జ్ శ్రీశ్రీనివాసన్ (52) చరిత్ర సృష్టించారు. యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్‌కు ప్రధాన న్యాయమూర్తిగా శ్రీనివాసన్ వ్యవహరించనున్నారు. ఫెడరల్ సర్క్యూట్ కోర్టును తర్వాత అత్యంత శక్తివంతమైందిగా భావిస్తారు. ఒబామా హయాంలోనే డీసీ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ శ్రీనివాసన్.. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రేసులోనూ ఉన్నారు. తాజాగా రెండోసారి ఆయనను చీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ ఫిబ్రవరి 12న ఉత్తర్వులు వెలువడ్డాయి. మారిక్ గార్లాండ్ జడ్జ్‌గా విధులు నిర్వర్తించిన శ్రీనివాసన్.. డీసీ సర్క్యూట్ కోర్టులో 1997 నుంచి న్యాయమూర్తిగా ఉన్నారు. అనంతరం 2013లో చీఫ్ జస్టిస్‌గా నాటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పాలనలో తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు, సుప్రీంకోర్టుకు గ్యార్లాండ్ నుంచి ఆయనను ఒబామా నామినేట్ చేసినా సెనేట్‌లో రిపబ్లికన్లు దీనిని అడ్డుకున్నారు. మే 2013లో రెండో అత్యంత శక్తివంతమైన డిస్ట్రిక్ట్ కొలంబియా సర్క్యూట్‌కు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్‌గానూ రికార్డుల్లోకి ఎక్కారు. భారతీయ సంతతికి చెందిన నియోమీ రావ్‌ను డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే కోర్టులో న్యాయమూర్తిగా నియమించారు. జస్టిస్ శ్రీనివాసన్‌ను రెండోసారి డీసీ కోర్టు అప్పీల్స్‌కు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడపై సెనేటర్ మార్క్ వార్నర్ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఫర్ డీసీ సర్క్యూట్ చీఫ్ జస్టిస్‌గా శ్రీనివాసన్‌ ఎంపిక కావడం భారతీయ- అమెరికన్లకు మరో మైలురాయి అధిగమించారని యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ అధ్యక్షుడు అజిత్ పాయ్ వ్యాఖ్యానించారు. పూర్తిపేరు.. పద్మనాభన్ శ్రీకాంత్ శ్రీ శ్రీనివాసన్. తమిళనాడులోని తిరునాల్వే ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్ తండ్రి 1970లో అమెరికాకు వలసవెళ్లారు. చండీగఢ్‌లో 1962 ఫిబ్రవరి 23న చండీగఢ్‌లో జన్మించిన శ్రీనివాసన్ విద్యాభ్యాసం అమెరికాలోనే సాగింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, లా, ఎంబీఏలను పూర్తిచేస్తారు. అనంతరం ఫోర్త్ సర్క్యూట్ జడ్జ్ జే హర్వై విల్కిన్‌సన్, యూఎస్ సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సాండ్రా డే ఓ కొననోర్ వద్ద లా క్లర్క్‌గా విధులు నిర్వహించారు. 2011లో యూఎస్ కోర్ట్ ఆప్పీల్స్‌లో సభ్యుడిగా నియమించిన తర్వాత ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటన్ జనరల్‌గానూ పనిచేశారు.


By February 19, 2020 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/indian-american-judge-sri-srinivasan-becomes-chief-justice-of-powerful-federal-circuit-court/articleshow/74203431.cms

No comments