Breaking News

కీచక వార్డెన్.. అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి రూమ్‌కి రావాలంటూ


ఉద్యోగాల కోసం కుటుంబసభ్యులను వదిలి వచ్చి హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిల పట్ల వార్డెన్ అత్యంత నీచంగా ప్రవర్తించిన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. గురుగ్రామ్‌లో లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్న మదన్ అనే వ్యక్తి అక్కడ ఉంటే యువతులతో స్నేహంగా ఉండేవాడు. వారు ఏం సాయం అడిగినా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. Also Read: ఇదంతా అతడి ఓ కోణమే. మరో కోణంలో అతడిలో ముసుగేసుకున్న కామాంధుడు ఉన్నాడు. అమ్మాయిలు ఉండే గదులతో పాటు బాత్రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన మదన్ వారు స్నానం చేస్తున్నప్పడు, బట్టలు మార్చుకుంటున్న వీడియోలు సేకరించి తన కంప్యూటర్‌లో స్టోర్ చేసుకునేవాడు. వాటిని అమ్మాయిలను పంపి కోరికలు తీర్చాలని వేధించేవాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఆ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. Also Read: కొందరు యువతులు అతడి బెదిరింపుల లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకుంటే, మరికొందరు హాస్టల్ వదిలి వెళ్లిపోయారు. పరువు పోతుందని బాధితురాళ్లు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకపోవడంతో అతడు ఇంకా రెచ్చిపోయాడు. ఇటీవల హాస్టల్‌లో చేరిన రేష్మ(పేరు మార్చాం) అనే యువతిని కూడా మదన్ అదేవిధంగా వేధించాడు. ఆమె న్యూడ్ వీడియోలు సేకరించి కోరిక తీర్చాలని వెంటపడ్డాడు. దీంతో ఆమె హాస్టల్‌లోనే ఉరేసుకోబోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని మదన్‌‌‌ని అరెస్ట్ చేశారు. అయితే హాస్టల్‌లో ఉంటున్న కొందరు అమ్మాయిలు నిర్వాహకుడు అంతటి దుర్మార్గుడని తమకు తెలియదని అంటున్నారు. బాధిత అమ్మాయిలెవరూ తమకు జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోకపోవడంతో అతడి ఆగడాలు ఇన్నాళ్లపాటు సాగినట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read:


By February 19, 2020 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ladies-hostel-warden-filming-video-while-girls-bath-in-gurugram-arrested/articleshow/74202864.cms

No comments