Breaking News

కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వుహాన్ హాస్పిటల్ డైరెక్టర్.. 1868కి చేరిన మరణాలు


కరోనా వైరస్ కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య ఫిబ్రవరి 17 నాటికి 1,868కి చేరింది. మంగళవారం ఒక్క రోజే 98 మందికిపైగా ప్రాణాలు వదిలారు. 72 వేల మందికిపైగా బారినపడ్డారని చైనా ప్రభుత్వం తెలిపింది. కరోనా బారిన పడటంతో.. వుహాన్‌లోని ఓ హాస్పిటల్ డైరెక్టర్ సైతం ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ లియు ఝిమింగ్ కరోనా వైరస్ కారణంగా మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారని సీసీటీవీ రిపోర్టర్ తెలిపారు. కోవిడ్ కారణంగా చనిపోయిన హాస్పిటల్ తొలి డైరెక్టర్ ఝిమింగే కావడం గమనార్హం. గతంలో కరోనా వైరస్ పరీక్షల కోసం రెండ్రోజుల సమయం తీసుకోగా.. ఇప్పుడు 4-6 గంటల్లోనే కరోనా వైరస్‌ను నిర్ధారిస్తున్నామని చైనా విదేశంగా శాఖ తెలిపింది. కరోనా విజృంభణ కారణంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వైద్య పరికరాలపై టారిఫ్‌లను మినహాయిస్తున్నట్టు చైనా ప్రకటించింది. మరోవైపు డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో ఉన్న వారిలో 454 మందికి కరోనా వైరస్ సోకిందని జపాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ షిప్‌ను యోకహోమా తీరంలో నిలిపి ఉంచారు. కరోనా వైరస్ భయంతో న్యూయార్క్, లండన్ నగరాలు సహా ప్రధాన విమానయాన మార్గాల్లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ సేవలను తాత్కాలికంగా మూసివేసింది. డిమాండ్ తక్కువగా ఉండటమే దీనికి కారణమని పేర్కొంది.


By February 18, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-update-director-of-hospital-in-wuhan-dies-of-infection/articleshow/74185833.cms

No comments