Breaking News

World Famous Lover: పేరు మార్చుకున్న విజయ్‌ దేవరకొండ.. ఎందుకో..?


అర్జున్‌ రెడ్డి సినిమాతో ఒక్కసారి సెన్సేషన్ సృష్టించిన నటుడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా సూపర్‌ హిట్ అందుకోవటామే కాదు జాతీయ స్థాయి క్రేజ్‌ సంపాదించుకున్నాడు విజయ్‌. తరువాత గీత గోవిందం సినిమా కూడా ఘన విజయం సాధించటంతో విజయ్‌ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. అదే జోరులో అయితే వరుసగా నోటా, డియర్‌ కామ్రేడ్ సినిమాలు ఫెయిల్ కావటంతో ఇప్పుడు తన కెరీర్‌ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈ క్రేజీ స్టార్‌ ఓ డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నాడు. ఫీల్‌గుడ్‌ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. Also Read: తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. అయితే టీజర్‌లో విజయ్‌ దేవరకొండ పేరు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అందరికీ విజయ్‌ దేవరకొండగా మాత్రమే తెలిసినా ఈ రౌడీ హీరో పేరు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ టీజర్‌ దేవరకొండ విజయ్‌ సాయి అని వేశారు. విజయ్‌ దేవరకొండ పూర్తి పేరు అదే అయినా సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి సాయి లేకుండానే ఫేమస్‌ అయ్యాడు విజయ్‌ దేవరకొండ. కానీ ఈ సినిమాతో తన పూర్తి పేరును పరిచయం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. అయితే విజయ్ కేవలం తన పూర్తి పేరు అభిమానులకు తెలియజేయాలనే అలా పేరు వేసుకున్నాడా..? లేక గత చిత్రాల రిజల్ట్‌తో నేమ్‌ కరెక్షన్‌ లాంటివి ఏదైనా ట్రై చేస్తున్నాడా? అన్న చర్చ కూడా మొదలైంది. మరి అసలు విషయం ఏంటో తెలియాలంటే మాత్రం విజయ్‌ దేవరకొండ స్పందించాల్సిందే. Also Read:


By January 04, 2020 at 10:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/young-hero-vijay-deverakonda-changes-his-name/articleshow/73094437.cms

No comments