Breaking News

మైనర్ బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు


పెళ్లయిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను గర్భవతిని చేశారు. ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి బాలికను లొంగదీసుకున్నాడు. ఈ సంఘటన నగర శివారు మండల పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. శంషాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంషాబాద్‌కు చెందిన ఓ బాలిక (17) ఇంటి వద్దే ఉంటోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితుడు నిత్యం బాలిక తండ్రి వద్దకు వస్తుండేవాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న బాలికపై కన్నేశాడు. Also Read: ప్రతి రోజూ తండ్రి కోసం వచ్చినట్లు వచ్చి.. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుందాం అంటూ బాలికను మభ్యపెట్టాడు. తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించి బాలిక గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వివాహితుడిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. Also Read:


By January 04, 2020 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-raped-minor-girl-now-pregnant-her/articleshow/73094717.cms

No comments