ఇల్లరికానికి భయపడి.. పెళ్లికి ముందురోజు షాకిచ్చిన వరుడు

అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. కాబోయే భార్యపై ప్రేమతో ఇల్లరికం వచ్చేందుకు యువకుడు అంగీకరించాడు. దీంతో పెళ్లికి చకచకా ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లికి ఒకరోజు ముందు కనిపించకుండా పోవడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్‌లో బుధవారం చోటుచేసుకుంది. లోకేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో, ముథోల్ గ్రామానికి చెందిన సంతోష్‌కు నెల రోజుల కిందట వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలోనే ఇల్లరికం వెళ్లేందుకూ అతను అంగీకారం తెలిపాడు. Also Read: బుధవారం ఉదయం పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రమే యువతి సహా ఆమె కుటుంబ సభ్యులందరూ ముథోల్‌కు చేరుకున్నారు. అదే సమయంలో యువకుడు అదృశ్యం కావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా బుధవారం సాయంత్రం వరకు అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పెళ్లిని రద్దు చేశారు. అయితే సంతోష్ ఉద్దేశ పూర్వకంగానే అతను పరారయ్యాడనే నిర్ధారణకు వచ్చిన వధువు తరఫు వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ కోసం గాలిస్తున్నారు. అతడికి వివాహం ఇష్టం లేదా? ఇల్లరికం వెళ్లడం ఇష్టం లేక పరారయ్యాడా? అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By January 30, 2020 at 09:05AM
No comments