Breaking News

కొంపలు మార్చే ఈ లేడీ.. కొల్లగొట్టడంలో కిలాడీ


‘ఇల్లు అద్దెకు ఇస్తాం’ అని బోర్డు కనిపిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసేస్తుంది. అమాయకంగా మాట్లాడి నమ్మకంగా ఇంట్లో చేరుతుంది. అక్కా, పిన్నీ, బాబాయ్.. అంటూ చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకుంటుంది. ప్రపంచంలో తనకంటే నమ్మకస్తురాలు ఇంకెవరూ ఉండరు అనేలా వారితో ప్రవర్తిస్తుంది. చివరికి కళ్లుగప్పి వారి ఇళ్లు గుల్ల చేస్తుంది. వరంగల్‌లో ఘరానా చోరీలకు పాల్పడుతున్న ఈ మాయ‘లేడి’ని చివరకు పోలీసులు పట్టుకున్నారు. Also Read: వరంగల్‌లోని (కేయూ) పరిధిలో ఇటీవల వరుస చోరీలు చోరీలు జరుగున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో నిఘా వేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌ చేసి 6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేయూ సీఐ డేవిడ్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌ మండలం హైసమ్మవాగు తండాకు చెందిన భూక్య రజిత యాదవనగర్, పెద్దమ్మగడ్డ ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుంది. చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుని నమ్మకస్తురాలిగా ఇళ్లలోకి వస్తూపోతూ ఉండేది. అయితే ఆ ఇళ్లలో వారి కదలికలను పసిగట్టి ఎవరూ లేని ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేస్తోంది. వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి మరో ఏరియాకు మకాం మార్చేది. ఈ నేపథ్యంలో రెడ్డిపురం క్రాస్‌ వద్ద సోమవారం రజిత అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా దొంగతనాల గుట్టు వెలుగు చూసింది. పెద్దమ్మగడ్డ, యాదవనగర్‌ ప్రాంతాల్లో చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. ఆమె నుంచి 6 తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Also Read:


By January 07, 2020 at 02:32PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/warangal-police-arrest-thief-recover-gold-from-her/articleshow/73136960.cms

No comments