హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం.. మైనర్ బాలికపై ఇంటి యజమాని రేప్

హైదరాబాద్‌లో మరో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో అద్దెకుంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ఇంటి యజమాని అలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. Also Read: కాలాపత్తర్ ప్రాంతంలో ఓ కుటుంబం అద్దె ఇంట్లో ఉంటోంది. వారి కుమార్తెపై కన్నేసిన ఇంటి యజమాని ఆదివారం బాలికను ఏదో పని ఉందని తన గదిలోకి పిలిచాడు. ఆమె లోపలికి వెళ్లగానే తలుపులు మూసేసి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వదిలిపెట్టాడు. Also Read: ఈ విషయాన్ని బాలిక ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పడంతో ఆమె కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By January 07, 2020 at 02:38PM
No comments