Breaking News

సమంత కొత్త యాడ్.. పెళ్లికూతురిగా అదిరిపోయింది


అక్కినేని కోడలు చేతినిండా సినిమాలు, టీవీ ప్రకటనలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో టీవీ కమర్షియల్స్‌లో నటించిన సమంత తాజాగా ఓ కాఫీ బ్రాండ్ యాడ్‌లో నటించారు. ఇందులో సమంత భర్తగా ప్రముఖ నటుడు మాధవన్ నటించారు. ఈ తమిళ యాడ్‌లో సమంత ఎరుపు రంగు చీర కట్టుకుని పెళ్లి కూతురిగా ముస్తాబయ్యారు. వధువు గెటప్‌లో సమంతను చూడటానికి రెండు కళ్లు చాలడంలేదంటూ అభిమానులు తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇప్పటివరకు సమంత ఎన్నో టీవీ ప్రకటనల్లో నటించారు కానీ పెళ్లి కూతురిగా మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. తొలిసారి సమంత ‘ఆసిక థంగమలిగాయ్’ అనే జ్యువెలీ యాడ్‌లో కనిపించారు. తొలిసారి ఆమె స్క్రీన్‌పై కనిపించింది ఈ యాడ్‌లోనే. ఆ తర్వాత ‘అరసన్ వాషింగ్ పౌడర్’, ‘చిక్ జాస్మిన్ షాంపూ’, ‘కోకా కోలా’ తదితర టీవీ కమర్షియల్స్‌లో నటించారు. తన కెరీర్‌లో సమంత మొత్తం 26 టీవీ ప్రకటనల్లో నటించారు. అయితే తన భర్త నాగచైతన్యతో కలిసి రెక్సోనా, బిగ్ బజార్ ప్రకటనల్లో నటించారు. ఈ రెండు ప్రకటనలు బాగా క్లిక్ అయ్యాయి. ఎందుకంటే పెళ్లయ్యాక సామ్, చై కలిసి నటించిన తొలి ప్రకటనలు ఇవే కావడం విశేషం. READ ALSO: ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ‘జాను’ సినిమాతో బిజీగా ఉన్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘96’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో శర్వానంద్ కథానాయకుడిగా నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. ఇందులో సమంత టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. READ ALSO:


By January 17, 2020 at 11:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-samantha-akkineni-stuns-in-new-ad-with-madhavan/articleshow/73319932.cms

No comments