Breaking News

వయస్సు 25, చోరీలు 51.. హైదరాబాద్‌లో ఘరానా దొంగ అరెస్ట్


హైదరాబాద్‌ పోలీసులను కొన్నాళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఎట్టకేలకు చిక్కాడు. 9 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సుమారు 51పైగా చోరీ కేసుల్లో నిందితుడిని గురువారం మియాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. చిన్న వయస్సులోనే చోరీల బాట పట్టిన అతడిపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించినా తన ప్రవృత్తి మాత్రం మానలేదు. Also Read: నెల్లూరుకు చెందిన వి.వెంకటేష్‌ కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. హైదర్‌నగర్‌ డివిజన్‌ రాంనరేష్‌ నగర్‌లో నివాసముంటూ చోరీలకు పాల్పడుతున్నాడు. చిన్న వయస్సులోనే క్రికెట్‌ బెట్టింగ్‌తో పాటు మద్యం వ్యసనానికి బానిసైన వెంకటేష్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లు చోరీచేస్తూ తొలిసారి పోలీసులకు చిక్కాడు. అప్పట్లో మైనర్‌ కావడంతో పోలీసులు జ్యూవెనల్‌ హోంకు తరలించారు. శిక్ష ముగిసిన అనంతరం బయటకు వచ్చిన అతడు చోరీలు కొనసాగించాడు. దీంతో సైబరాబాద్‌ పోలీసులు వెంకటేష్‌పై 2015-16లో పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఆ శిక్ష అనుభవించి 2019 జులైలో జైలు నుంచి విడుదలయ్యాడు. Also Read: ఆ తర్వాత ఆరునెలల వ్యవధిలో నగరంలోని 7 పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడు. ఉదయం కాలనీల్లో పేపర్‌బాయ్‌గా నటిస్తూ తాళం వేసివున్న ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు చోరీలకు పాల్పడేవాడు.. డిసెంబరులో మియాపూర్‌ బీకే ఎన్‌క్లేవ్‌, ఈ నెలలో బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనేక ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన సైబరాబాద్‌ పోలీసులు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు పాత నేరస్థుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం మియాపూర్‌ పోలీసులు మయూరినగర్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద స్థితిలో కనిపించిన వెంకటేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 45.5తులాల బంగారు నగలు, బైక్‌తో పాటు రూ.1.17లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిపై నగరంలో సుమారు 51 కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. Also Read:


By January 17, 2020 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/most-wanted-thief-arrested-in-hyderabad/articleshow/73319282.cms

No comments