తల్లి, భార్య, ముగ్గురు పిల్లలను దారుణంగా చంపి.. బిల్డింగ్‌పై నుంచి దూకి

బిహార్ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. ఉన్మాదిలా మారిన ఓ వ్యక్తి సొంత కుటుంబాన్నే పొట్టన పెట్టుకున్నాడు. ముంగేర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ.. గురువారం అతడిలో రాక్షసుడు నిద్రలేచాడు. నిద్రలో ఉన్న భార్య, ముగ్గురు బిడ్డలతో పాటు కన్నతల్లిని కత్తితో గొంతుకోసి హతమార్చాడు. Also Read: అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురిని చేయడానికి గల కారణలను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనలో ముంగేర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. Also Read:
By January 17, 2020 at 11:12AM
No comments