Breaking News

హెచ్‌ఓడీతో రాసలీలల వీడియో లీక్.. హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య


తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఓమలూరులోని పెరియార్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టికి చెందిన తిరుమలై కుమార్తె నివేద బీటెక్ సెకండియర్ చదువుతోంది. ఆదివారం కాలేజీ హాస్టల్‌ రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు వార్డెన్‌కు సమాచార ఇచ్చారు. దీంతో ఆయన కరుప్పూర్‌ పోలీసులకు ఫోన్ చేశారు. Also Read: సమాచారం అందుకున్న సూర మంగళం ఇన్‌స్పెక్టర్, సేలం డిప్యూటీ కమిషనర్‌ తంగదురై, అసిస్టెంట్‌ కమిషనర్‌ సెల్వరాజ్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. నివేద మృత దేహం వద్ద మూడు పేజీల సూసైడ్‌ నోట్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. నివేది రాసిన సూసైడ్‌ నోటిలోని అంశాల ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read: మరోవైపు నివేద చదువుతున్న విభాగంలోని హెచ్‌ఓడీ ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది నివేదనా? లేక వేరొకరా? అని పరిశీలిస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సూరమంగళం పోలీసులు తెలిపారు. Also Read:


By January 13, 2020 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/btech-student-commits-suicide-in-tamilnadu/articleshow/73222001.cms

No comments