Breaking News

నువ్వు లేక నేను లేనంటూ.. ప్రియుడు చనిపోయిన చోటే రైలుకింద పడి వివాహిత ఆత్మహత్య


అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ప్రియుడి ఆత్మహత్యను తట్టుకోలేకపోయిన ఓ వివాహిత అదే ప్రాంతంలో రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడింది. తమిళనాడులోని తిరునెల్వేలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మూలకరైపట్టికి చెందిన మురుగన్‌ కుమార్తె కర్పగం (25)కు కొన్నాళ్ల క్రితమే ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అభిప్రాయభేదాల కారణంగా ఆమె రెండేళ్ల క్రితం భర్తనుంచి విడిపోయి ఓ సంస్థలో పనిచేస్తూ కుమారుడిని పోషిస్తోంది. Also Read: ఈ క్రమంలోనే అదే కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్న నరసింగనల్లూరు తిరువళ్లువర్‌నగర్‌కు చెందిన మహారాజన్‌ (26)తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ తిరుపూర్‌కు వెళ్లి మరో కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల మురుగన్‌ తన కుమార్తె కనిపించడం లేదని మూలకరైపట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టి మహారాజన్‌తో ఉంటున్నట్లు గుర్తించారు. ఆమెను తీసుకొచ్చి తండ్రికి అప్పగించినా తరుచూ ప్రియుడి దగ్గరికి వెళ్లి రాసలీలలు కొనసాగించేది. Also Read: తనను పెళ్లి చేసుకోవాలని కర్పగం ప్రియుడిని కోరగా.. అతడు తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీనికి వారు ససేమిరా అనడంతో కర్పగం మండిపడింది. తనను ప్రియుడు మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన మహరాజన్ శనివారం మలయాళమేడు రైల్వే గేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కర్పగం తీవ్ర మనస్తాపానికి గురై మహారాజన్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే రైలు కింద పడి బలవర్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో కర్పగం ఐదేళ్ల కుమారుడు అనాథగా మారాడు. Also Read:


By January 13, 2020 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-married-woman-commits-suicide-over-depression-of-lover-suicide/articleshow/73222362.cms

No comments