Breaking News

సొంత చెల్లినే తల్లిని చేసిన కామాంధుడు.. పసిగుడ్డును చెత్తకుప్పలో పడేసి


రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలినే తల్లిని చేశాడో కీచక సోదరుడు. అతడి అఘాయిత్యానికి బాలిక బిడ్డను ప్రసవించింది. దీంతో తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళనతో ఆ బిడ్డను చెత్తకుప్పలో పడేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో చోటుచేసుకుంది. Also Read: సూరత్‌లోని ఉమ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో చెత్తకుప్ప వద్ద ఈ నెల 15న ఓ శిశువు ఏడుపు వినిపించింది. స్థానికంగా ఉండే ప్రతిభా బోర్స్ అనే మహిళ అక్కడికి వెళ్లి చూడగా రోజుల వయసున్న పసిగుడ్డు కనిపించింది. దీంతో శిశువును ఇంటికి తీసుకెళ్లిన ఆమె స్నానం చేయించి పాలు తాగించి చుట్టుపక్కల వారికి సమాచారమిచ్చింది. దీంతో వారు పోలీసులకు విషయం చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును సంరక్షణా కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: ఈ సందర్భంగా పోలీసులకు ఓ విషయం తెలిసింది. అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక గర్భంతో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. అమాయకురాలైన బాలికను సొంత అన్నే బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, అతడి కారణంగానే ఆమె గర్భం దాల్చినట్లు వెల్లడైంది. బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో తన బండారం బయటపడుతుందన్న ఆందోళనతోనే ప్రసవం కాగానే శిశువును ఎత్తుకెళ్లి చెత్తకుప్పలో పడేసినట్లు తేలింది. Also Read: ఆ యువతి చెప్పిన వివరాలతో పోలీసులు సైతం షాకయ్యారు. కామంతో రక్తం పంచుకుపుట్టిన చెల్లిపైనే ఇంతటి నీచానికి పాల్పడిన ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. అతడిపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతో పెద్దలు రహస్యంగా ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


By January 24, 2020 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/surat-minor-girl-gives-birth-child-of-her-brother-police-booked-case/articleshow/73570865.cms

No comments