మూగ బాలికను నిర్బంధించి.. కారులోనే సామూహిక అత్యాచారం

దేశంలో కామాంధుల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినా, నిర్భయ దోషులకు ఉరిశిక్ష వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా మృగాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూగ యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: రేవా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మూగ బాలిక రెండ్రోజుల క్రితం సరుకుల కోసం స్థానిక దుకాణానికి వెళ్తోంది. ఆమెపై కన్నేసిన ముగ్గురు దుండగులు కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె ఇంటి సమీపంలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని సైగలతో చెప్పడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఓ మైనర్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:
By January 16, 2020 at 10:39AM
No comments