Breaking News

పెళ్లి మండపం నుంచే ప్రియురాలితో పారిపోయిన వరుడు.. సినీఫక్కీలో ట్విస్ట్


కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన ప్రియురాలితో కలిసి పరారైన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌‌లో జరిగింది. భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయించాడు. శనివారం పెళ్లి జరిపించేందుకు ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశాడు. పెళ్లి చేసుకునేందుకు వరుడు ఆగ్రా నుంచి కారులో మండపానికి బయలుదేరాడు. అయితే ముహూర్త సమయం సమీపిస్తున్నా వరుడి తరుఫు వారు రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది Also Read: దీంతో వారు ఆరా తీయగా షాకింగ్ విషయం తెలిసింది. వరుడు అంతకుముందే మరో యువతిని ప్రేమించాడని, పెళ్లికి వస్తూ మార్గమధ్యలో ఆమెతో పారిపోయినట్లు తెలియడంతో అందరూ షాకయ్యారు. ఈ ఘటనతో మొహం చూపించలేక పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువులు మండపానికి రాకుండా తప్పించుకున్నారు. పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. Also Read: అయితే పెళ్లికి హాజరైన బంధువుల్లోని ఓ యువకుడు వధువును తాను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. అతడిని వివాహం చేసుకునేందుకు పెళ్లికూతురు కూడా అంగీకరించడంతో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సినిమా ట్విస్టులతో జరిగిన ఈ పెళ్లి అందరి మొహాల్లోనూ ఆనందాన్ని నింపింది. Also Read:


By January 16, 2020 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/groom-ran-away-with-his-lover-in-before-wedding/articleshow/73290288.cms

No comments