Breaking News

హైదరాబాద్‌లో దారుణహత్య.. మద్యం తాగించి గొంతు కోసి


నగరంలో పండగ రోజు కలకలం రేగింది. దుండిగల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన యాదగౌడ్‌ను ఆసిఫ్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి, గొంతు కోసి దారుణంగా చంపేశాడు. Also Read: యాదగౌడ్‌తో పీకల దాకా మద్యం తాగించిన ఆసిఫ్ ఆ తర్వాత దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రాణాలు దక్కించుకునేందుకు యాదగౌడ్ చేసి ప్రయత్నాలు విఫలం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యాదగౌడ్‌ను పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


By January 16, 2020 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-brutally-killed-in-dundigal-hyderabad-accused-arrested/articleshow/73289152.cms

No comments