Breaking News

బడంగ్‌పేటలో బీజేపీకి షాక్.. ప్రత్యర్థికి మేయర్ పీఠం ఆఫర్ చేసిన మంత్రి


కార్పొరేషన్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు షాకిచ్చింది. ఈ కార్పొరేషన్లో టీఆర్ఎస్ 13 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ ఏడు చోట్ల, బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో బీజేపీతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ భావించింది. ఇద్దరు ఇండిపెండెంట్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. ఇక్కడ టీఆర్ఎస్‌కు ఐదుగురు ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. బీజేపీకి చెక్ పెట్టడం కోసం, ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలకు ఆమె గాలం వేశారు. కాంగ్రెస్ నేత, మాజీ వైస్‌ చైర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డితో సబిత సంప్రదింపులు జరిపారు. 31వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన ఆయన భార్య పారిజాతారెడ్డికి మేయర్‌ పదవి ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు కూడా చేరవేశారు. కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పారిజాతారెడ్డి ఆదివారం టీఆర్ఎస్‌లో చేరారు. తనకు ఆధిక్యం రాకపోయినప్పటికీ.. కార్పొరేషన్‌ను చేజారకుండా టీఆర్ఎస్ చూసుకోగలిగింది. మీర్‌పేటలోనూ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇక్కడ 19 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 16 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 8 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా.. వీరిలో ఏడుగుర్ని టీఆర్ఎస్ తమవైపు తిప్పుకొంది. దీంతో మేయర్ పదవి టీఆర్ఎస్‌కు ఖాయమైంది.


By January 27, 2020 at 09:04AM


Read More https://telugu.samayam.com/telangana/news/minister-sabitha-indra-reddy-helps-trs-to-win-badangpet-mayor-chair/articleshow/73651788.cms

No comments