Breaking News

చైనాను వణికిస్తోన్న కరోనా: 80కి చేరిన మృతులు.. బీజింగ్ సహా నాలుగు నగరాల్లో ఆంక్షలు


ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మృతిచెందినవారి సంఖ్య 80కి చేరుకున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా 2,744 కేసులు నమోదయినట్టు తెలిపింది. వైరస్ తొలిసారి బయటపడ్డ హుబే ప్రావిన్సుల్లోనే ఆదివారం 24 మంది చనిపోయినట్టు తెలియజేసింది. హుబే తప్ప మిగతాచోట్ల కరోనా వైరస్ మృతులను ధ్రువీకరించలేదు. ఒక్క ఆదివారమే కొత్తగా 769 కేసులు నమోదయినట్టు నేషనల్ హెల్త్ మిషన్ పేర్కొంది. వైరస్ బారినపడ్డ 2,744 మందిలో 461 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించింది. వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ ఓ వ్యక్తి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిచెందుతుంది. ఈ వైరస్ సోకితే శ్వాసవ్యవస్థను నిర్వీర్యమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి హుబే ప్రావిన్సుల్లోని పలు నగరాల్లోని ప్రజా రవాణాను చైనా నిలిపివేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను మూసివేసి ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. దీంతో వైరస్ వ్యాప్తి కొంత నెమ్మదించింది. పదిహేడేళ్ల కిందట చైనా, హాంకాంగ్‌లో 750 మందిని పొట్టనబెట్టుకున్న సార్స్ మాదిరిగానే కరోనా అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, షాండాంగ్ ప్రావిన్సుల్లోని నాలుగు నగరాలు బీజింగ్, షాంఘై, జియాన్, తియాంజ్‌ల్లో దూర ప్రయణాలపై ఆంక్షలు విధించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను నగరాల్లోకి రాకుండా, బయటకు వెళ్లకుండా ఆదేశాలు జారీచేశారు. దీంతో, చైనా నూతన సంవత్సర సెలవుల ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సదరన్ ప్రావిన్సుల్లోని గ్యాంగ్డాంగ్, జియాంగ్జీతో సహా మరో మూడు నగరాల్లోని ప్రజలు సైతం మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని సూచిస్తూ ఆదేశాలు జారీచేశారు.


By January 27, 2020 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-said-coronavirus-death-toll-spikes-to-80-over-2700-cases-confirmed/articleshow/73651764.cms

No comments