Breaking News

కూకట్‌పల్లిలో వ్యభిచారం గుట్టురట్టు.. గుంటూరు నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి..


హైదరాబాద్‌లో గుట్టుగా సాగుతున్న మరో వ్యభిచార దందాను పోలీసులు గుట్టురట్టు చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో రోడ్ నం.1లో స్పా పేరుతో కొనసాగుతున్న సెక్స్‌రాకెట్‌పై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన ఓ యువతితో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. Also Read: కూకట్‌పల్లికి చెందిన ఆరిపాక కృష్ణ(23) అనే యువకుడు కేపీహెచ్‌బీ ఒకటో నంబర్ రోడ్డులో స్పా కేంద్రం నిర్వహిస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఓ యువతి అక్కడ పనిచేస్తోంది. అయితే స్పా కేంద్రంతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కృష్ణ అడ్డదారులు తొక్కాడు. తన వద్ద పనిచేసే యువతికి పెద్దమొత్తంలో డబ్బు ఆశ చూపించి ఆమెతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు. ఆమె సాయంతో ఇతర ప్రాంతాల నుంచి మరికొంతమంది యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నాడు. సోషల్‌మీడియా ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్‌నే వ్యభిచార కేంద్రంగా మార్చేశాడు. Also Read: స్పా సెంటర్‌కు వచ్చే కస్టమర్లపై అనుమానం వచ్చిన కొందరు ఈ విషయాన్ని కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మాదాపూర్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు, కేపీహెచ్‌బీ పోలీసులు సంయుక్తంగా శనివారం సాయంత్రం స్పా సెంటర్‌పై దాడిచేశారు. ఈ సందర్భంగా కృష్ణతో పాటు యువతి, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. మరో ఆరుగురు యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిర్వాహకుల నుంచి రూ.1.36 లక్షల నగదు, భారీ సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కేపీహెచ్‌పీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. Also Read:


By January 27, 2020 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prostitution-racket-busted-in-kphb-colony-hyderabad-4-arrested-6-sex-workers-rescued/articleshow/73652130.cms

No comments