Breaking News

ఖమ్మంలో బాలికపై అత్యాచారం.. మాజీ సర్పంచిని చితక్కొట్టిన స్థానికులు


అభం శుభం తెలియని 12ఏళ్ల అమాయక బాలికపై 63 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన జిల్లా ముదిగొండ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధి గ్రామంలో ఓ బాలిక తన తండ్రికి ఫోన్‌ చేసేందుకు మాజీ సర్పంచి కేతిరెడ్డి కోటిరెడ్డి(63) ఇంటికి వెళ్లింది. తండ్రితో ఫోన్‌లో మాట్లాడాక మిరపకాయలు తీసుకొని రమ్మని కోటిరెడ్డి బాలికకు చెప్పాడు. ఆమె వాటిని తీసుకొని తిరిగి అతని ఇంటికి వెళ్తుండగా గదిలోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: కాసేపటి బాలిక తల్లి ఇంటికి రాగా కుమార్తె కనిపించలేదు. అదే సమయంలో కోటిరెడ్డి ఇంటి నుంచి బాలిక అమ్మా అంటూ కేకలు వేయడంతో అక్కడికి వెళ్లింది. బాలిక రోదిస్తూ జరిగినదంతా తల్లికి వివరించింది. ఆగ్రహించిన బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు కోటిరెడ్డిని పట్టుకుని చితకబాదారు. వారి నుంచి తప్పించుకుని గదిలో దాక్కున్న అతడిని బయటకు లాగి దాడిచేశారు. ఈ విషయం తెలుసుకున్న ఖమ్మం గ్రామీణ, రఘునాథపాలెం, కూసుమంచి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన నిందితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read: ఖమ్మం గ్రామీణ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి, ఖమ్మం మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ అంజలి ముదిగొండ పీఎస్‌కు చేరుకుని బాలిక, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలిక చెప్పిన వాంగ్మూలం తీసుకుని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కోటిరెడ్డిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 23, 2020 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-raped-by-former-sarpanch-in-khammam-district/articleshow/73539912.cms

No comments