కర్నూలులో దారుణం.. కన్నతండ్రి గొంతు కోసి చంపిన బాలుడు

రోజూ మద్యం తాగి వచ్చి తల్లితో గొడవ పడుతున్న తండ్రిని గొంతు కోసం చంపేశాడో బాలుడు. ఈ ఘటన జిల్లా నందవరం మండలం ముగతిలో శనివారం రాత్రి జరిగింది. ముగతికి చెందిన వ్యక్తికి(38) భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. Also Read: ఇటీవల మద్యానికి బానిసైన అతడు వచ్చిన ఆదాయమంతా మద్యానికి ఖర్చు చేస్తున్నాడు. పగలంతా కష్టపడి పనిచేయడం, రాత్రి ఆ డబ్బులతో ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి భార్య, బిడ్డలను వేధిస్తున్నాడు. దీంతో కుటుంబసభ్యులంతా అతడి తీరుతో విసిగిపోయారు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి ఆ వ్యక్తి భార్యతో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. కోపోద్రిక్తుడైన వారి 16ఏళ్ల కుమారుడు వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తితో తండ్రి గొంతులో పొడిచాడు. Also Read: తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబపెద్ద చనిపోవడం, అందొస్తాడనుకున్న కొడుకు జైలుకు వెళ్లడంతో తల్లీకూతుళ్లు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. Also Read:
By January 05, 2020 at 08:54AM
No comments