Breaking News

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. సహజీవనం చేసి పరారైన యువకుడు


ప్రేమిస్తున్నానని నమ్మించి యువతితో సహజీవనం చేసి ఆర్థిక అవసరాలు తీర్చుకున్న ఓ యువకుడు పెళ్లి సమయానికి పరారైన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ‘‘కులాలు వేరైనా మనద్దిరం ఒకటే.. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నాం.. మా అమ్మానాన్నలు మన పెళ్లికి ఒప్పుకున్నారు. .. ఎల్లుండి ప్యారడైజ్‌ కన్వెన్షన్‌లో పెళ్లి.. నా పేరుమీద బుక్‌ చేశాను..ఉదయాన్నే మీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చేయండి.. పెళ్లయ్యాక ఇద్దరమే ముంబయి, దిల్లీకి వెళ్దాం... మా అమ్మ తన నగలన్నీ నీకే ఇచ్చేస్తానంది’ అంటూ ప్రియుడి ఫోన్ చేసి చెప్పడంతో ఆ యువతి మురిసిపోయింది. అతడి మాటలు నమ్మి సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ కన్వెన్షన్‌కు కోటి ఆశలతో వెళ్లిన ఆమె షాకైంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో నిర్వాహకులను సంప్రదించగా పెళ్లి లేదు... నిశ్చితార్థం లేదు... వెళ్లండి అంటూ చెప్పారు. Also Read: దీంతో అక్కడి నుంచే ప్రియుడికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. తనను మోసం చేశాడని గ్రహించిన ఆమె సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించింది. సికింద్రాబాద్‌లో నివాసముంటున్న యువతి బేగంపేటలోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఐటీ విభాగంలో నాలుగేళ్లుగా పనిచేస్తోంది. మాసాబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌లో ఉండే ప్రవీణ్‌ మూడేళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం ప్రవీణ్‌ను కూడా ఐటీ విభాగానికి మార్చడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కులాలు వేరైనా పెళ్లికి తన తల్లిదండ్రులను ఒప్పిస్తానని ప్రవీణ్ నమ్మించడంతో యువతి అతడితో సహజీవనం మొదలుపెట్టింది. Also Read: ఈ క్రమంలో ఆమెను బాపట్లలో ఉంటున్న తన బంధువులకు తన కాబోయే భార్య అని చెప్పాడు. కానీ అతని తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. అయితే నవంబరు 13న యువతికి ఫోన్ చేసిన ప్రవీణ్ ప్యారడైజ్‌లో పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో అతడు చెప్పిన రోజున బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి కంగుతింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 05, 2020 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-young-man-make-living-to-gether-relations-with-woman-cheats-before-marriage/articleshow/73104852.cms

No comments