Breaking News

అలీ కూడా ఆ వ్యాపారంలోకి.. భారీ ప్లాన్‌లో స్టార్‌ కమెడియన్‌


టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అలీ. కమెడియన్‌గా కొనసాగుతూనే కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించాడు. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగానూ సక్సెస్‌ అయిన అది కొద్ది మందిలో ఒకడు. అయితే ఇటీవల అలీకి అవకాశాలు తగ్గాయి. యంగ్ హీరోల సరసన సూట్ కాకపోవటం, కొత్త జనరేషన్‌ కామెడియన్‌లు రావటంతో అలీ గతంలో ఉన్నంత బిజీగా లేడు. దీంతో టెలివిజన్‌ రంగం మీద దృష్టి పెట్టిన అలీ హోస్ట్‌గా దూసుకుపోతున్నాడు. సినీ తారలను ఇంటర్వ్యూ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. నటుడిగా, టెలివిజన్‌ హోస్ట్‌గా కొనసాగుతూనే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. చాలా కాలంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న అలీ, గత ఎన్నికలకు ముందుకు వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరాడు. Also Read: తాజాగా వ్యాపార రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు అలీ. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న డిజిటల్‌ రంగంలో నిర్మాణాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, సీరియల్స్‌ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం ఎంటర్‌టైన్మెంట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నిర్మాణంతో పాటు ఇతర నిర్మాతలకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహాకారాలు తమ సంస్థ నుంచి అందించేలా ప్లాన్‌ చేస్తున్నాడు. బాబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి మనోజ్‌ హుస్సేన్‌ క్రియేట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడని వెల్లడించారు.


By January 05, 2020 at 08:37AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-comedian-ali-starts-aliwood-to-produce-web-series/articleshow/73104841.cms

No comments