Breaking News

పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం


తమిళనాడులోని తూత్తుక్కుడిలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చెన్నై అడయారు శాస్త్రినగర్‌కు చెందిన సుభాచంద్రబోస్‌ (73), లక్ష్మీ దంపతులు ఆలయాలను దర్శించుకునేందుకు 16వ తేదీన కారులో బయలుదేరారు. వారితో పాటు మదురైకి చెందిన బంధువులు వీరేంద్రన్‌ (15), రమ్య (20), రమ్య స్నేహితురాలు భార్గవి మరో కారులో వెళ్లారు. ఈ క్రమంలోనే శుక్రవారం మదురైలోని మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న వీరంతా తిరుచ్చెందూరు ఆలయానికి బయలుదేరారు. ఈ కారును జోషువా (30) అనే డ్రైవర్‌ నడుపుతున్నాడు. Also Read: ఈ కారు శుక్రవారం అర్ధరాత్రి స్టెరిలైట్‌ పరిశ్రమ సమీపంలో వంతెనపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. కారు లారీలోకి దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. దీంతో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రమ్య, భార్గవి, జోషువాల మృతదేహాలను వెలికి తీసి తూత్తుక్కుడి ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరేంద్రన్‌ మృతదేహాన్ని బయటకు తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. జిల్లా ఎస్పీ అరుణ్‌పాల్‌ గోపాలన్‌, డీఎస్పీలు ప్రకాశ్‌, ప్రతాప్‌ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 19, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/car-and-lorry-collide-in-tamilnadu-4-died/articleshow/73367927.cms

No comments