టీటీడీలో పనిచేస్తే సెక్స్ చాట్ నిషిద్దమా?: థర్టీ పృథ్వీపై కత్తి డర్టీ పోస్ట్
తాజా మాజీ ఎస్వీబీసీ చైర్మన్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కి మద్దతుగా నిలిచారు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పృథ్వీ ఫోన్ కాల్ రాసలీలల ఆడియో రికార్డ్స్‌పై పెద్ద ఎత్తున పార్టీ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఈ ఇష్యూలో తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు పృథ్వీరాజ్. అయితే ఆ ఫోన్ కాల్స్ ఫేక్ అని.. ఇదంతా తన ఎదుగుదలను తట్టుకోలేక చేసిన కుట్రలో భాగమే అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు పృథ్వీరాజ్. ఇక ఈ ఇష్యూపై మూవీ క్రిటిక్, పొలిటికల్ అనలిస్ట్ మహేష్ కత్తి వివాదాస్పద పోస్ట్ షేర్ చేశారు. ఆయన ఫేస్ బుక్ ఖాతాలో పృథ్వీరాజ్‌కు మద్దతు ప్రకటిస్తూ ప్రశ్నలు సంధించారు. పృథ్వీరాజ్ ఆడియో టేప్ లీక్ ఇప్పుడే విన్నాను. అది అతని గొంతా కాదా అనేది పక్కనపెడితే, ఆ అమ్మాయికూడా ఇంట్రస్టు ఉన్నట్టే మాట్లాడింది. ప్రోత్సహించింది. అంటే "మ్యూచ్యువల్" అనే అర్థం అవుతోంది. మరి ఇక సమస్య ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేవాళ్ళు ఎవరూ ప్రేమించుకోకూడదా? సంసారాలు చెయ్యకూడదా? సెక్స్ చాట్, టాక్ నిషిద్దమా?’ అంటూ షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేశారు కత్తి మహేష్.
By January 13, 2020 at 09:19AM
No comments