Breaking News

‘బాహుబలి’ రికార్డ్‌ను బ్రేక్ చేసిన బన్నీ


తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకోవాలంటే ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’ తర్వాత అంటుంటారు. ఆ రేంజ్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1500 కోట్ల రూపాయాలకు పైగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా వసూళ్లను స్టైలిష్ స్టార్ నటించిన ‘అల వైకుంఠపురములో’ బీట్ చేసేసింది. అయితే ఇండియాలో మాత్రం కాదులెండి. శుక్రవారం రాత్రి అమెరికా, న్యూజిల్యాండ్‌లో ‘అల వైకుంఠపురము’ ప్రీమియర్ షోలు వేశారు. న్యూజిల్యాండ్‌లో ప్రీమియర్ షోలు 34,625 డాలర్ల వసూళ్లు రాబట్టాయి. అది కూడా కేవలం మూడు ప్రదేశాల్లోనే సినిమాను ప్రదర్శించారు. ఐదు షోలకే అన్ని డాలర్లు వసూళ్లు చేయడం విశేషం. అయితే ‘బాహుబలి’ ప్రీమియర్‌కు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టింది. ఈ రకంగా చూసుకుంటే అక్కడ బన్నీ.. ప్రభాస్‌ను బీట్ చేసేశాడనే చెప్పాలి. ఇక అమెరికాలో అయితే ప్రీమియర్ షో వసూళ్లు మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్స్‌ను బీట్ చేశాయి. అక్కడ ఈ సినిమాను 151 ప్రదేశాల్లో విడుదల చేశారు. తొలిరోజు ప్రీమియర్ షోలు 557,825 డాలర్లు వసూలు చేశాయి. ఆస్ట్రేలియాలో ‘అల వైకుంఠపురములో’ సినిమా నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ ప్రీమియర్ షోలు 239,144 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేశాయి. ఇక సింగపూర్ బాక్సాఫీస్ వద్ద అయితే బన్నీ కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్ షోల ద్వారా సినిమా 22,000 సింగపూర్ డాలర్లు రాబట్టింది. READ ALSO: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. టబు, జయరాం, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, మురళీ శర్మ, సునీల్, సచిన్ ఖెడేకర్, హర్షవర్ధన్ సహాయ పాత్రల్లో నటించారు. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని విలన్ పాత్రలో నటించారు. READ ALSO:


By January 13, 2020 at 09:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stylish-star-allu-arjun-breaks-ss-rajamoulis-baahubali-record/articleshow/73221443.cms

No comments