Breaking News

సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 10 అంతస్తుల భవనం


వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి గాంచిన గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. 10 అంతస్తులు గల రఘుబీర్ మార్కెట్‌లోని దుకాణాల్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఫైరింజన్‌కు ఫోన్ చేశారు. Also Read: భారీ భవనంలోనే అనేక వస్త్ర దుకాణాలుండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఏకంగా 40 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా వెలువడుతున్న పొగ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి. పొగ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తి నష్టంపై ఇంకా అంచనా రానప్పటికీ.. రూ.కోట్లలో ఉండొచ్చని తెలుస్తోంది. Also Read:


By January 21, 2020 at 10:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/fire-at-surat-raghuveer-market-40-fire-engines-rushed/articleshow/73470185.cms

No comments