Breaking News

పెళ్లి కబురు వినిపించిన ఎవర్‌గ్రీన్ బ్యూటీ త్రిష


చెన్నై బ్యూటీ దక్షిణాది చిత్రపరిశ్రమలో బిజీ అయిపోయారు. తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ప్రొఫెషన పరంగా త్రిష్ కిర్రాక్ నటి అని నిరూపించేసుకున్నారు. మరి పర్సనల్ జీవితం మాటేంటి? అదేనండీ త్రిష పెళ్లి గురించి. ఒకప్పుడు వరుణ్ అనే బిజినెస్‌మ్యాన్‌‌తో త్రిష కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు వైపుల పెద్దలను ఒప్పించి చెన్నైలో గ్రాండ్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ వరుణ్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు త్రిష ప్రకటించారు. అయితే ఇందుకు కారణం మాత్రం వెల్లడించలేదు. పెళ్లయ్యాక కూడా త్రిష సినిమాలు చేస్తాను అనడం వరుణ్‌కు నచ్చలేదని అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని కోలీవుడ్‌ వర్గాలు ప్రచారం చేశాయి. ఆ తర్వాత సినీ నటుడు రానాతో కొంతకాలం పాటు త్రిష ప్రేమాయణం కొనసాగించారు. రానా.. త్రిషకు ముద్దుపెడుతున్న ఫొటోలు సుచీ లీక్స్ సమయంలో బయటపడ్డాయి. త్రిషతో డేటింగ్ చేసిన మాట నిజమే కానీ ఇద్దరి మధ్య బంధం నిలబడలేదని ఓసారి రానానే వెల్లడించారు. అయితే తాజాగా త్రిష పెళ్లి గురించి ఓ కబురు వినిపించారు. నిన్న త్రిష ఫ్యాన్స్‌తో కాసేపు ఇన్‌స్టా్గ్రామ్‌లో చాటింగ్ చేశారు. READ ALSO: ఈ సందర్భంగా ఓ అభిమాని త్రిషను ప్రశ్నిస్తూ.. ‘మీ బకెట్ లిస్ట్‌లో ఉన్న ఓ కోరికను చెప్పండి’ అని అడిగాడు. ఇందుకు త్రిష స్పందిస్తూ.. ‘లాస్ వెగాస్‌లో పెళ్లి చేసుకోవాలని ఉంది’ అన్నారు. అయితే ఆ మహా ఘట్టం ఎప్పుడు అని మాత్రం త్రిష చెప్పలేదు. పోన్లెండి.. త్రిషకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇంకా ఉందని ఈ సమాధానంతో అయినా అర్థమైంది. ప్రస్తుతం త్రిష చేతిలో పది సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక మలయాళం సినిమా ఎనిమిది తమిళ సినిమాలు ఒక తెలుగు సినిమా ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో త్రిష నటిస్తున్నారు. READ ALSO:


By January 21, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chennai-beauty-trisha-krishnan-reveals-her-wedding-plan-on-instagram-chat-session/articleshow/73471807.cms

No comments