Breaking News

కోదాడలో కామాంధుడు.. కోరిక తీర్చాలంటూ కన్నకూతుళ్లపైనే వేధింపులు


కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతుళ్లపైనే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో కామాంధుడు. భర్తకు దూరంగా ఉంటున్న పెద్దకుమార్తెతో పాటు మైనర్ అయిన రెండో కూతురిని కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడు. ఆరునెలలుగా జరుగుతున్న ఈ కీచకపర్వాన్ని బాధితురలు తల్లికి చెప్పుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో పెరిక హాస్టల్‌ సమీపంలో ఉండే ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తెకు 2016లో వివాహం చేశాడు. అయితే దంపతుల మధ్య గొడవలు రావడంతో కొద్ది నెలలుగా ఆ యువతి పుట్టింట్లోనే ఉంటోంది. తల్లి పనులకు వెళ్లిన సమయంలో తన కోరిక తీర్చాలంటూ ఆ కామాంధుడు పెద్ద కుమార్తెను వేధించసాగాడు. ఆరు నెలలపాటు ఓపిక పట్టిన ఆమె చివరికి తల్లికి విషయం చెప్పడంతో ఆమె నిలదీసింది. ఇకపై కూతురిని వేధించనని, బుద్ధిగా ఉంటానని అతడు నమ్మబలకడంతో మిన్నకుండిపోయారు. Also Read: దీన్ని అలుసుగా తీసుకున్న అతడు చిన్న కూతురిని కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె అక్కతో కలిసి కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:


By December 30, 2019 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-for-sexual-harassment-on-two-daughters-in-kodad/articleshow/73025025.cms

No comments