Breaking News

విషాదం నింపిన రోడ్డుప్రమాదం.. భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయిన భార్య


ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులను రోడ్డుప్రమాదం విడదీసింది. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైంది. జిల్లా మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో కవిటి మండలం కాజూరు గ్రామానికి చెందిన బందరు రోజా (46) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త మోహన్‌రావు స్వల్పగాయాలతో బయటపడ్డారు. Also Read: కాజూరు గ్రామానికి చెందిన బందరు మోహన్‌రావు, భార్య రోజా తమ సామాజిక వర్గానికి చెందిన వనభోజనాలను సోంపేట మండలం ఎకవూరు సముద్రపు తీరం వద్ద ఆదివారం ఏర్పాటు చేయడంతో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వారి కుమారుడు హరీష్‌ బంధువులతో కలిసి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. మోహన్‌రావు, రోజా బైక్‌పై తిరుగు పయనమయ్యారు. వీరు జాడుపూడి కాలనీ వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ మోపెడ్‌ హ్యాండిల్‌కు రాసుకొని వెళ్లింది. దీంతో మోపెడ్‌ అదుపుతప్పి భార్యాభర్తలు రోడ్డుపై పడిపోయారు. రోజా తలపై నుంచి అదే కంటైనర్ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మోహన్‌రావు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. Also Read: ప్రమాదం జరిగిన తర్వాత కంటైనర్ ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ వాహనాన్ని కొజ్జిరి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. మోహన్‌రావు కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కుమార్తె ధనలక్ష్మికి ఇటీవలే వివాహం చేశారు. కుమారుడు హరీష్‌ డిగ్రీ పూర్తిచేసుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. రోజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌ఐ సి.హెచ్‌.దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 30, 2019 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-killed-in-road-accident-in-srikakulam-district-one-injured/articleshow/73025182.cms

No comments