Breaking News

చటాన్‌పల్లి కిడ్నాప్ కథ సుఖాంతం... షాకింగ్ విషయం చెప్పిన కిడ్నాపర్


రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌ సమీపంలోని చటాన్‌పల్లిలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. జడ్చర్లకు చెందిన దంపతులు గ్రామంలో నివసిస్తూ భవన నిర్మాణ పనులు చేస్తుంటారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తు స్నేహిత(4) ఉన్నారు. మంగళవారం(డిసెంబర్ 17) స్కూల్ నుంచి వచ్చిన స్నేహిత బయట ఆడుకుంటోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి బిస్కెట్లు కొనిస్తానని నమ్మించిన బాలికను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. Also Read: పాప కనిపించకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు చుట్టుపక్క ప్రాంతాల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించారు. పాపను ఓ వ్యక్తి బైక్‌ ఎక్కించుకుని జడ్చర్ల వైపు వెళ్లడాన్ని పోలీసులు గమనించారు. దీంతో ఆ మార్గంలో తనిఖీలు చేపట్టి కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. Also Read: స్నేహితను అతడి బారి నుంచి కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను కిడ్నాప్ చేసిన వ్యక్తి కూడా జడ్చర్లకు చెందిన వాడేనని, ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతోనే బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ‘దిశ’ హత్యాచారం, తర్వాత నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో దేశవ్యాప్తంగా మార్మోగిన చటాన్‌పల్లిలో ఈ ఘటన జరగడంతో కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 24 గంటలు గడవకముందే పాపను కాపాడటంతో కథ సుఖాంతమైంది. Also Read:


By December 18, 2019 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/shadnagar-police-rescued-4-yr-old-girl-kidnapper-held/articleshow/72862913.cms

No comments