Breaking News

Rashmika Mandanna: ఆ సీక్రెట్ మీకు పర్సనల్‌గా చెప్తా.. దేవీ శ్రీతో హీరోయిన్‌


సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా రిలీకు రెడీ అవుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న మహేష్‌కు జోడిగా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాస్‌ మహేష్ బాబు మండేస్‌ పేరుతో ప్రతీ సోమవారం సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఇస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సోమవారం సినిమాలో రష్మిక, మహేష్‌ను టీజ్‌ చేస్తున్న సందర్భంలో వచ్చే ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. హీ ఈజ్‌ సో క్యూట్ అంటూ సాగే ఈ పాటకు గతంలో రిలీజ్ చేసిన చేసిన పాటల కంటే మంచి రెస్సాన్స్‌ వచ్చింది. దీంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. Also Read: ఈ సందర్భంగా హీరోయిన్‌ రష్మిక, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ `మన కాంబినేషన్‌ను మరింత పెద్దదిగా చేద్దాం సార్‌` అంటూ ట్వీట్ చేసింది. అయితే ట్వీట్‌తో చివరల్లో ఓ కోతి బొమ్మను యాడ్‌ చేసింది రష్మిక. ఈ ట్వీట్‌పై స్పదించిన దేవీ శ్రీ `సరే.. మన కాంబినేషన్‌ను క్యూట్‌, స్వీట్, ఆసమ్‌గా చేద్దాం. కానీ నువ్వు నా పేరు చివర కోతి బొమ్మ ఎందుకు పెట్టావ్‌. నువ్వు దీనికి సమాధానం చెప్పాలి` అంటూ రిప్లై ఇచ్చాడు. దేవీ రిప్లైపై స్పందించిన రష్మిక `ఆ సీక్రెట్‌ ఏంటో మనం కలిసినప్పుడు నేను మీకు మాత్రమే చెప్తా` అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో రష్మిక ట్వీట్ వైరల్‌గా మారింది. దేవీ శ్రీ, రష్మిక మధ్య ఏం జరిగింది. రష్మిక ఎందుకు అలా ట్వీట్ చేసిందో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. Also Read: మహేష్‌ బాబు మిలటరీ మేజర్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. అనిల్‌ మార్క్‌ కామెడీతో పాటు మహేష్‌ ఇమేజ్‌కు తగ్గ కథా కథానలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దిల్‌ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్‌ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


By December 18, 2019 at 09:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sarileru-neekevvaru-team-devi-sri-prasad-and-rashmika-mandanna-funny-conversation/articleshow/72862765.cms

No comments