Breaking News

`సుమన్‌, కవితల సపోర్ట్ మర్చిపోలేము`


ఇటీవల తెలుగులో వంద సినిమాలు పూర్తి చేసుకున్న సీనియర్ నటుడు ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతుంది. సుమన్ జోడిగా నటిస్తున్న ఈ సినిమాలో అలం సందీప్, ప్రమీల హీరోహీరోయిన్లు. బొంతు శ్రీనివాస్ దర్శకత్వంలో, ఏ.వి.భాస్కర్ నిర్మిస్తున్న సినిమా ఫైనల్ షెడ్యుల్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏ.వి.భాస్కర్ మాట్లాడుతూ.. `ఇప్పటివరకు మంచిర్యాల కోనసీమలలో రెండు షెడ్యూల్స్ జరిపాము. ఇప్పుడు జరుగుతున్న షెడ్యుల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అవుతుంది. త్వరలో టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తాము. ఆడియోను జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము. దర్శకుడు మాకు ఏదైతే చెప్పాడో అంతే క్లియర్‌గా సినిమాని తెరకెక్కిస్తున్నారు. కొత్తగా సినిమాని నిర్మిస్తున్న మాకు సుమన్, కవిత గారు మంచి సపోర్ట్ చేసారు. నటీ నటులు టెక్నీషియన్స్ సహకారం బాగుంది. మంచి కథతో మంచి సినిమాని నిర్మిస్తున్నాం` అన్నారు. Also Read: దర్శకుడు బొంతు శ్రీనివాస్ మాట్లాడుతూ.. `విభిన్న కథా కథనాలతో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా వుంటుంది. సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెండు షెడ్యుల్స్‌ని పూర్తి చేసాము. సినిమా బాగా వస్తుంది. నిర్మాత సహకారం మరచిపోలేను. త్వరలో టైటిల్ ఎనౌన్స్ చేస్తాము` అన్నారు. ఈ సినిమాలో జెన్నీ, ఆశా, విజయభాస్కర్, కాకినాడ నాని, సాయి వర్ధన్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


By December 22, 2019 at 08:47AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actor-suman-new-movie-shooting-update/articleshow/72921896.cms

No comments