Breaking News

గద్వాల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం.. పోలీసులపై ఆరోపణలు


తెలంగాణలోని జోగులాంబ జిల్లా కేంద్రంలో ఎనిమిదేళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మూడురోజుల క్రితం బాలికను ఎత్తుకెళ్లిన నిందితులు గురువారం కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. గద్వాలకు చెందిన చెందిన బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. Also Read: మూడురోజుల క్రితం పాఠశాలకు వెళ్తున్న ఆమెను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై తల్లిదండ్రులు గద్వాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కొందరు యువకులపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారి ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. దాని ఆధారంగా కిడ్నాపర్లు బాలికను తొలుత హైదరాబాద్, అక్కడి నుంచి మహబూబ్‌నగర్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. Also Read: తమ బిడ్డ ‘దిశ’లా మారకుండా ఉండాలంటే పోలీసులు త్వరగా కిడ్నాపర్లును పట్టుకోవాలని బాలిక తల్లిదండ్రులు మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడంతో పోలీసలు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి తోడు కిడ్నాప్ వ్యవహారంపై మీడియాలో విస్తృతంగా ప్రసారం కావడంతో కిడ్నాపర్లు భయపడ్డారు. దీంతో గురువారం బాలికను బైక్ తీసుకొచ్చి గద్వాల కలెక్టరేట్ కార్యాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో పడివున్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. Also Read: ఈ కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో కొందరిని పోలీసులే గద్వాలలో దాచినట్లు ఉంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కిడ్నాపర్లు ఎక్కడున్నారో తెలిసి కూడా పోలీసులు వెంటనే స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు విషయమై కొందరు పోలీసుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. Also Read:


By December 27, 2019 at 09:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-8-girl-rescued-from-kidnapppers-in-gadwal-district-2-held/articleshow/72988723.cms

No comments