Breaking News

సమయం లైవ్ న్యూస్: రావత్ వ్యాఖ్యలపై దుమారం.. పాక్ నుంచి మిడతల దండు


⍟ రావత్ వ్యాఖ్యలపై దుమారం: పౌరసత్వ సవరణ చట్టంపై కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గురువారం నోరుజారి వివాదంలో చిక్కుకున్నారు. రావత్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. నిరసనలు హింసాత్మకంగా మారడాన్ని తప్పుపట్టిన రావత్‌.. కాలేజీలు, యూనివర్సిటీల్లోని విద్యార్థులు సహా ప్రజలను తప్పుదారి పట్టించి దాడులకు ప్రేరేపించడం నాయకత్వం కాదని రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ⍟ పాక్ నుంచి మిడతల దండు: దేశంలో అలజడి సృష్టించడానికి పాకిస్థాన్ నుంచి నిరంతరం ఉగ్రమూకలు చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇప్పుడు వారితోపాటు మిడతలు కూడా సరిహద్దుల్లోని భూభాగంలోకి దండెత్తి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. మిడతలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగి 11 బృందాలను గుజరాత్‌కు పంపింది. ⍟ రాజధానిపై నేడు నిర్ణయం: ఏపీ రాజధాని ఎక్కడ.. అమరావతిలోనే కొనసాగుతుందా.. సీఎం జగన్ చెప్పినట్లు మూడు రాజధానలు ఉండబోతున్నాయా.. ఇవాళే రాజధాని భవితవ్యం తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగనన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ⍟ బడేటి బుజ్జి పాడెమోసిన బాబు: మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి (కోట రామారావు) హఠాన్మరణం టీడీపీకి తీరని విషాదాన్ని నింపింది. ఏలూరులో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బుజ్జి ఇలా చనిపోవడం పార్టీకి తీరని లోటుగానే చెప్పాలి. ఆయన మరణంతో టీడీపీ కేడర్‌తో పాటూ అధినేత చంద్రబాబు సైతం ఒకింత షాక్ అని చెప్పొచ్చు. మరణ వార్త తెలియగానే చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు ఏలూరు వెళ్లారు.


By December 27, 2019 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-27th-december-2019/articleshow/72988673.cms

No comments