Breaking News

‘వంద రూపాయలిస్తా.. ఓ ముద్దిస్తావా’.. అంటూ బాలికపై లైంగిక వేధింపులు


పొలంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలిక చేయి పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన 12ఏళ్ల మాలిక మంగళవారం తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ పుల్లలు ఏరుకున్న తర్వాత తండ్రి ముందుగా ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపు పొలంలోనే తిరిగిన బాలిక తర్వాత పుల్లల మోపుతో ఇంటికి బయలుదేరింది. Also Read: ఆ సమయంలో రామన్నగూడెం పంచాయతీ దేవినేనివారిగూడెంకు చెందిన మోటమర్రి నాగసూర్య బాలాజీ అనే యువకుడు బాలిక వద్దకు వెళ్లి పుల్లల మోపు తలపై ఎత్తేందుకు సాయం చేశాడు. తర్వాత బాలిక చేయి పట్టుకుని ‘రూ.100లు ఇస్తాను. నాకు ముద్దిస్తావా’ అంటూ అసభ్యంగా మాట్లాడాడు. బాలిక అతడి నుంచి చేయి విదిలించుకుని పారిపోతుండగా అడ్డగించి అత్యాచారానికి యత్నించాడు. Also Read: బాధితురాలకు గట్టిగా కేకలు వేయడంతో భయపడి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాలిక నేరుగా ఇంటికి వెళ్లి తండ్రికి విషయం చెప్పింది. దీంతో అతడు కుమార్తెతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 27, 2019 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-sexual-harassment-on-12-yr-old-girl-in-west-godavari/articleshow/72988896.cms

No comments