Breaking News

ప్రియుళ్లతో కూతురిని రేప్ చేయించిన తల్లి... ఏడాదిగా దారుణం


విజయవాడలో ఓ యువకుడు 15ఏళ్ల బాలికను ఆమె తల్లి సహకారంతోనే అత్యాచారానికి పాల్పడి, వేధింపులకు గురిచేస్తున్న ఘటన మరువక ముందే గుజరాత్‌లో అలాంటి ఘటనే వెలుగుచూసింది. 12ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. కన్న కూతురిపై జరుగుతున్న అఘాయిత్యం గురించి తెలిసి కూడా ఆమె తల్లి నిందితులకే సహకరిస్తూ అమ్మ అనే పదానికే మాయని మచ్చ తెచ్చింది. Also Read: గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలోని పటితానా తాలుకా భుటియా గ్రామానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం ఉంది. వారు అప్పడప్పుడు ఆ మహిళ ఇంటికి వచ్చి రాసలీలలు సాగించేవారు. ఈ క్రమంలో వారి కన్ను ఆమె 12ఏళ్ల కుమార్తెపై పడింది. తమ కోరికను ప్రియురాలి వద్ద బయటపెట్టగా మందలించాల్సిన ఆమె వారికి సహకరించేందుకు ఒప్పుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుళ్లకు కబురు పంపి రప్పించి కుమార్తెపై చేయించేది. Also Read: ఇలా ఏడాదిగా ముగ్గురు కామాంధులు ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బాలిక ఇటీవల తండ్రికి చెప్పడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను బయటకు వెళ్లిన సమయంలో ఆ ముగ్గురు తన కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఆ ముగ్గురితో పాటు బాలిక తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By December 09, 2019 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/3-men-arrested-by-gujarat-police-over-raping-12-yr-old-girl-for-one-year/articleshow/72434847.cms

No comments