Breaking News

భర్తపై అలిగి మూడేళ్ల కుమార్తెతో సహా వివాహిత అదృశ్యం


కుటుంబ కలహాల కారణంగా భర్తపై అలిగిన మహిళ కుమార్తెతో సహా అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చరణ్‌దాస్, అనూష దంపతులు పార్శీగుట్టలోని సంజీవపురంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొద్దిరోజులు భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: ఈ నెల 6న దంపతుల మధ్య మరోసారి గొడవ జరగడంతో చరణ్‌దాస్ బయటకు వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన అనూష అదే రోజు మధ్యాహ్నం తన అన్నకు ఫోన్‌ చేసి తాను చిన్నకుమార్తె రితిక (3)ను తీసుకుని హుజూరాబాద్‌లోని పుట్టింటికి వెళుతున్నానని, పెద్ద కూతురు మన్విత(5)ను స్కూల్ నుంచి తీసుకు రావాలని భర్త చరణ్‌దాస్‌కు చెప్పాలని సూచించింది. Also Read: అయితే సాయంత్ర వేళ ఇంటికి వచ్చిన చరణ్‌దాస్ అత్తమామలకు ఫోన్ చేయగా అనూష్ తమ వద్దకు రాలేదని చెప్పారు. ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనపడిన అతడు వెంటనే చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై చిలకలగూడ ఎస్ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనూష మిస్సింగ్‌పై రెండు కుటుంబాల్లో ఆందోళన చెందుతున్నాయి. Also Read:


By December 09, 2019 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-missing-with-3-yr-old-daughter-in-hyderabad-case-booked/articleshow/72433301.cms

No comments