తన భర్తతో అఫైర్ పెట్టుకుందని.. నర్సును చిత్రహింసలు పెట్టిన వైద్యురాలు

తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో నర్సుపై ఓ మహిళా డాక్టర్ పైశాచికంగా ప్రవర్తించింది. ఆమెను మంచానికి కట్టేసి కత్తులతో పొడుస్తూ ఆరు గంటల పాటు చిత్రహింసలు పెట్టింది. జిల్లా కేంద్రంలో ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: సూర్యాపేటకు చెందిన భార్యభర్తలు డాక్టర్లు. వారిద్దరూ ఎంజీ రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రిని నిర్వహిస్తూ పై అంతస్థులో నివాసముంటున్నారు. అయితే లేడీ డాక్టర్‌కు భర్తపై ఎప్పటి నుంచో అనుమానం ఉంది. ఆస్పత్రిలో పనిచేసే నర్సులతో అతడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు అనుమానించి తరుచూ గొడవలు పెట్టుకునేంది. ఇదే అనుమానంతో గతంలో ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు నర్సులను ఆమె తొలగించింది. ప్రస్తుతం అదే ఆస్పత్రిలో పనిచేసే నర్సు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆమె అనుమానించింది. Also Read: ఈ నెల 6వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న నర్సును ఆ లేడీ డాక్టర్ తన ఇంటికి తీసుకెళ్లింది. తన భర్తతో అక్రమ సంబంధం మానుకోవాలని హెచ్చరిస్తూ మరో ఇద్దరు నర్సుల ముందే ఆమెను మంచానికి కట్టేసి చిత్రహింసలు పెట్టింది. ఆపరేషన్ చేసే కత్తులతో గుచ్చుతూ పైశాచికానందం పొందింది. తనకూ డాక్టర్ మధ్య ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు చెబుతున్నా పట్టించుకోకుండా సుమారు ఆరు గంటల పాటు చిత్రహింసలు పెట్టింది. Also Read: తర్వాత ఆ డాక్టర్ ఆస్పత్రికి వెళ్లడంతో బాధితురాలు తన స్నేహితురాలి సాయంతో అక్కడి నుంచి తప్పించుకుంది. అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డాక్టర్ దంపతులపై ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న నిందితురాలి భర్త నర్సుతో రాజీ బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసు వాపసు తీసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పుతామని ఆ డాక్టర్ బాధితురాలిని ప్రలోభపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు నర్సు ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By December 10, 2019 at 10:06AM
No comments